అటల్‌జీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

అటల్‌జీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

సత్యసాయి: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయ్ విగ్రహ స్థాపన కోసం ధర్మవరం పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో మంగళవారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీఎం శేఖర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటల్‌జీ సేవలు దేశానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన కొనియాడారు.