'డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా'

'డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా'

NZB: నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ (DD)లో పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ ఇవాళ తెలిపారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు.