చింతగుంపలపల్లిలో పశు ఆరోగ్య శిబిరం
BPT: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చిన్నగంజాం మండలం చింతగుంపల్లిలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ నిర్ధారణ వీర్యం వల్ల వచ్చే ఆడ దూడల ఉత్పత్తి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. అనంతరం 62 పశువులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో చీరాల సహాయ సంచాలకులు డాక్టర్ చిట్టిబాబు పశువైద్యాధికారులు డాక్టర్ కిరణ్, ఆశ తదితరులు పాల్గొన్నారు.