'రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'
KMM: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతి పత్రం అందించారు. ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు లింగనబోయిన లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీ నుంచి తప్పుకునే ప్రయత్నం కనపడుతుందన్నారు.