VIDEO: మంచం పట్టిన కాషాయగూడెం గ్రామస్తులు

WGL: వర్ధన్నపేట మండలం కాషాయగూడెం గ్రామంలో ప్రజలు జ్వరాలతో మంచం పట్టారు. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ విజృంభిస్తుండగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు బాదితుల సంఖ్య పెరుగుతున్నది. ఏ వాడలో చూసిన జ్వర పీడితులు కనిపించడం ఆందోళనకు గురిచేస్తుంది. జ్వరంతో బాధపడుతున్నా ఎవరు అధికారులు పట్టించుకోవడంలేదని ఆదివారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.