ఘనంగా నాయక్‌పోడ్ భీమన్న ఉత్సవాలు ప్రారంభం
NZB: ముప్కాల్ మండలంలోని కొత్తపల్లిలో ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాయక్‌పోడ్ భీమన్న ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజలు, ఆదివాసీ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం భీమన్న గజ్జలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించనున్నారు.