పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

ELR: సత్యనారాయణ పేటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ సుధాకర్ పేకాట శిబిరంపై బుధవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.