చేపల వలకు చిక్కుకొని జాలరి మృతి

NRML: చేపల వేట కోసం వెళ్లి జాలరి మృతి చెందిన ఘటన శనివారం సోన్ మండలం గాంధీనగర్‌లో జరిగింది. సోన్ ఎస్ఐ వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన బసవరాజ్ (47)ని న్న ఎస్సారెస్పీ డ్యాంకు చేపలు పట్టడానికి వెళ్లి, కాళ్లకు వలచిక్కుకొని మృతి చెందాడని, శనివారం నీటిలో నుండి బయటకు తీసి పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశామని తెలిపారు.