టీమిండియాపై న్యూజిలాండ్ ప్రధాని ప్రశంసలు

టీమిండియాపై న్యూజిలాండ్ ప్రధాని ప్రశంసలు

మహిళల వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టుపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్ జట్టు ట్రోఫీ గెల్చుకోలేకపోయినందున భారత్ ప్రపంచకప్ గెలవాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించడం తనకు నచ్చిందని చెప్పారు. భారత జట్టు ఆటతీరు అద్భుతమని.. ప్రపంచకప్ గెలవడానికి వారు అర్హులు అని పేర్కొన్నారు.