VIDEO: నల్ల నీళ్ల సమస్య తీవ్రం.. భయాందోళనలో స్థానికులు
WGL: నెక్కొండ(M) కేంద్రంలోని నందమూరి నగర్ కాలనీలో గత 8 నెలలుగా నల్ల నీళ్లు మురికిగా వస్తున్నాయి. నీటిలో పాకురు, ఎరుపు రంగు పురుగులు కనిపిస్తున్నాయని కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని నివాసితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.