VIDEO: కొలనుపాక సోమేశ్వర ఆలయంలోప్రత్యేకపూజలు
BHNG: ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రాచీన సుప్రసిద్ధమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకంతో పాటు, బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీకదీపం వెలిగించి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.