కల్తీ నెయ్యి కేసు.. విజయభాస్కర్ రెడ్డికి బిగ్ షాక్
AP: కల్తీ నెయ్యి కేసులో ఏ34 నిందితుడు, డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మస్ చేసింది. అంతేకాదు కల్తీ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. కాగా, అర్హత లేని డెయిరీలకు విజయభాస్కర్ రెడ్డి సహకరించారని, తద్వారా భారీగా లబ్ధి పొందారని సిట్ అధికారులు గుర్తించారు.