'హెచ్పీవీ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం 14 ఏళ్లు పైబడిన వారికి అందిస్తున్న హెచ్పీవీ టీకాను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ కోరారు. పెగడపల్లి పీహెచ్సీలో సోమవారం బాలికలకు టీకాలు వేసి, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.