ఆ ఊరు వెళ్లాలంటే.. ఈ గోతులు దాటాల్సిందే!
SKLM: ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు మీద ఉన్న గోతులు దాటాల్సిందేనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీనర్సుపేట రోడ్డు నుంచి బసవరాజుపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారిపోయింది. రెండు దశాబ్దాలకు పైగా రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో చెరువుల్ని తలపించేలా తయారయ్యాయి. వీటిని బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.