'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండలంలోని రామన్నపేట గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు బుధవారం రాత్రి ఆవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఫోన్ ద్వారా ఓటీపీలు అడిగే వారు, బ్యాంకు ఉద్యోగుల మని చెప్పే మోసగాళ్లకు చెప్పవద్దన్నారు.