రమణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణం బాపూజీ నగర్‌కు చెందిన రామిరెడ్డి వెంకట రమణారెడ్డి మృతి పట్ల, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం వారి నివాసానికి చేరుకున్నారు. ఆయన రమణారెడ్డి భౌతిక కాయాన్ని దర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.