సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు మోదీ ఫోన్
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, మహ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాలని, నావిగేషన్ స్వేచ్చను నిర్థారించవలసిన అవసరం ఉందని ఇరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.