VIDEO: యూరియా లభ్యతపై సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకటన

VIDEO: యూరియా లభ్యతపై సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకటన

GDWL: గట్టు మండల కేంద్రానికి శుక్రవారం 450 బస్తాల యూరియా రానున్నట్లు సింగిల్ విండో అధ్యక్షుడు క్యామా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు యూరియా లారీ వస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు.