నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
HYD: నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హైదరాబాద్-సైబరాబాద్ పోలీసులు ఆయా కమిషనరేట్ల పరిధిలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. నిన్న, ఇవాళ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో HYD-460, CYB-426 మంది పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి పట్టుబడ్డ మందుబాబుల మీద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చనున్నట్లు వారు స్పష్టం చేశారు.