పెట్టుబడి పేరుతో మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్
VSP: విశాఖలో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో మోసానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రమ్య అనే మహిళను నమ్మించి, ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.2.50 కోట్లు వసూలు చేశారు. ఈ మోసానికి పాల్పడిన తండ్రీకొడుకులు శివ, ప్రేమాసాగర్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.