సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించండి: AISF

తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద చేరుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని బకాయిలు ఉన్న మెస్, కాస్మటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలన్నారు.