దేవాలయాల మాన్యాల రక్షణకు సర్వే..!

WGL: జిల్లాలోని దేవాలయాల భూములు సంరక్షణకు దేవాదాయ శాఖ పూనుకుంది. ఈ మేరకు ఆలయాల భూముల కోసం సర్వే చేయించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సర్వే ద్వారా కబ్జా అయిన ఆలయ భూములను గుర్తించనున్నారు. సర్వే ద్వారా గుర్తించిన మాన్యాలకు జియో ట్యాగింగ్ చేసి వాటిపై కోర్టు కేసులు వేసి ఆలయ భూములు ఆలయాలకు కట్టబెట్టేందుకు దేవాదాయ శాఖ ప్రణాళికలను రూపొందిస్తోంది.