VIDEO: 'సంతలో గొర్రెలు, కోళ్లకు భలే గిరాకి'

ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకు శుక్రవారం వారపు సంతలో గొర్రెలు, మేకలు, కోళ్లకు గిరాకి ధర పలికింది. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో మేకలు, కోళ్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ సంతకు ఒడిశా రాష్ట్రం నుంచి విశాఖ మైదాన ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి ఎగబడి కొనుగోలు చేశారు. ఒక్కొక్క మేక, గొర్రె రూ.10వేల నుంచి 20వేల వరకు ధర పలికినట్లు విక్రయదారులు తెలిపారు.