జిల్లాలో భారీ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఎస్పీ

VZM: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రహదారి భద్రతలో తనిఖీలు చేప్పాట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్, ముఖ్య కూడళ్లు వద్ద విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇవాళ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఆగస్టు 4 నుంచి 10 వరకు మొత్తం 295 కేసులు నమోదు చేశామన్నారు.