VIDEO: '3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా లక్ష్యం'
HYD: 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మాలక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పాలసీ రూపొందిస్తున్నామన్నారు. DEC 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ పై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, 4 లక్షల మంది సూచనలు చేశారన్నారు.