పాణ్యంలో రైల్వే గేటు మూసివేత

పాణ్యంలో రైల్వే గేటు మూసివేత

NDL: పాణ్యం మండల కేంద్రంలోని రైల్వే గేటును శుక్రవారం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రెండో రైల్వే మార్గం డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రైల్వే లైన్ ఉన్న రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల నుంచి బనగానపల్లెకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు వేరే రోడ్ల ద్వారా ప్రయాణించాలని అధికారులు సూచించారు.