ASP చైతన్య రెడ్డి మహిళా లోకానికే వన్నె తెచ్చిన అధికారి
కామారెడ్డి జిల్లాలో ASPగా పనిచేసిన చైతన్య రెడ్డి, తన అంకితభావంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కోల్కతా నకిలీ కరెన్సీ ముఠా, కంటైనర్ దొంగల గ్యాంగ్, డ్రగ్స్ మాఫియా వంటి కేసులను త్వరితగతిన ఛేదించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బుల్లెట్ రోమియోల సైలెన్సర్ చప్పుళ్లను మూగబోయేలా చేసి క్రమశిక్షణ నేర్పిన ఆమె బదిలీ కావడం కొంత నిరాశ కలిగించింది.