కంటోన్మెంట్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

కంటోన్మెంట్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

HYD: కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని తాను కాలనీల పర్యటన చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ఇవాళ ఆయన బొల్లారం చింతల్ బజార్,స్నేహ కాలనీలను సందర్శించారు. స్థానిక నివాసులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధి వంటి సమస్యలను పరిశీలించారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.