విద్యుత్ తీగలు తెగిపడి గేదెలు మృతి
KDP: కొండాపురం మండలం రామిరెడ్డి పల్లె వద్ద 2 గేదెలు ఆదివారం విద్యుత్ షాక్‌తో అక్కడకక్కడే మృతి చెందాయి. స్థానికుల వివరాల మేరకు మండలంలోని బెడుదురు గ్రామానికి చెందిన డేవిడ్ తన గేదెలను మేపుకోవడానికి రామిరెడ్డి పల్లె వైపు వెళ్ళాడు. గేదెలు విద్యుత్ తీగల కింద మేస్తుండగా ఒక్కసారిగా తీగలు తెగి పశువుల మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. గేద విలువ లక్ష ఉంటుందన్నారు.