బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ
PDPL: పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా మంజూరైన ఈ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం సర్వే నిర్వహిస్తున్నామని, రైతుల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే భూసేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.