హసీనాను దేశానికి తీసుకువస్తాం: బంగ్లాదేశ్

హసీనాను దేశానికి తీసుకువస్తాం: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెకు బంగ్లా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణ శిక్ష కూడా విధించింది. ఇప్పటికే ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ అనేకసార్లు అభ్యర్థించింది. అయితే భారత్ నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హసీనాను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటామని పేర్కొంది.