కొండపల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా.. కమిషనర్ చర్యలు

కృష్ణా: కొండపల్లి ఖిల్లా రోడ్డు గుంటకల్ సమీపంలో సుమారు 25 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి వెంచర్ వేశారు. ఈ మేరకు మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ మోస్మి ఆక్రమిత స్థలంలో బోర్డు ఏర్పాటు చేసి, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.