'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'
KMM: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్ స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. దీంతో యాజమాన్యాలు విద్యాసంస్థలను బంద్ చేశారని చెప్పారు.