కార్మికుల పక్షాన తీన్మార్ మల్లన్న హామీ

కార్మికుల పక్షాన తీన్మార్ మల్లన్న హామీ

HYD: దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మీటర్ రీడర్ల మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై కార్మికుల సమస్యలను విన్నారు. ఉద్యోగ భద్రత, నెలకు 30 రోజుల పని, రూ.25,000 కనీస వేతనం అంశాలను మార్చి 16 అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తానన్నారు.