మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను విశాఖపట్నంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంపై ఆయనతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.