సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన మాజీ మేయర్
RR: మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధి బాలాపూర్ డివిజన్‌లో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అందచేశారు. నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.