'భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలి'
కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరు గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న కళ్యాణోత్సవం, రథోత్సవం కార్యక్రమాల నేపథ్యంలో 7వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గండి దేవి హారిక, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.