VIDEO: రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు వినతి
కృష్ణా: కృష్ణాపురం గ్రామ శివారు నుంచి ముదిరాజుపాలెంకు వెళ్లే రహదారి గత కొన్ని దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ రహదారి ఇప్పటి వరకు కేవలం మట్టి రోడ్డుగా మాత్రమే కొనసాగుతూ.. వర్షాకాలంలో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారిందని గురువారం ప్రయాణికులు వాపోయారు. అధికారులు స్పందించి, ఈ రోడ్డును నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.