కోడూరులో ఎస్ఐ హెచ్చరికలు

కోడూరులో ఎస్ఐ హెచ్చరికలు

కృష్ణా: కోడూరు మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సై చాణిక్య ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అతివేగం రోడ్డుప్రమాదాలకు కారణమవుతుందని అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.