తగ్గిన సీసీఐ పత్తి కొనుగోలు ధరలు

NRML: భైంసా మార్కెట్‌లో సోమవారం నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్ల ధరలు తగ్గనున్నాయి. ఇది వరకు క్వింటాలు పత్తి ధర రూ. 7,521 ఉండగా నాసిరకం పత్తి వస్తున్నందున క్వింటాలు మద్దతు ధర రూ. 7,471 తో కొనుగోళ్లు జరుగుతాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపినారు. కావున రైతులు గమనించి సహకరించాలని కోరారు.