మహిళలకు ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాల పంపిణీ
HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు మరియు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మహిళలకు చీరలు, రుణాల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడతాయని తెలిపారు.