రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

TPT: రేణిగుంట మండల పరిధిలోని పాత చెక్ పోస్ట్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.