కాలువకు షట్టర్లు పెట్టాలని రైతుల డిమాండ్
WNP: భూత్పూర్ రిజర్వాయర్ కాలువకు షట్టర్లు బిగించాలని అమరచింత రైతులు ఎంపీ డీకే అరుణను కోరారు. గేట్లు లేక సాగునీరు వృథా అవుతూ రైతులు నష్టపోతున్నారని శుక్రవారం తెలిపారు. సమస్యపై వెంటనే చర్యలు తీసుకుని కాలువకు షట్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాలంటూ ఎంపీకి వినతి పత్రం అందజేశారు.