పారిపోయిన బాలుడు క్షేమంగా లభ్యం
HNK: ఐనవోలు మండలంలోని MJP బాలుర పాఠశాల నుంచి ఈ నెల 13న 7వ తరగతి విద్యార్థి అశ్విత్ పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట SI సాయిబాబు నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడు పెద్దాపూర్‌లోని పెద్దమ్మ ఇంటికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇవాళ బాలుడిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు.