సీఐని సన్మానించిన కంగ్టి మండల జర్నలిస్టులు

SRD: కంగ్టి నూతన సీఐ దమ్మ వెంకట రెడ్డికి మండలం జర్నలిస్టులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పూలదండలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిష్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలను ప్రపంచానికి తెలియజేసి జర్నలిస్టుల వృత్తి ఎంతో గొప్పదని సీఐ కొనియాడారు. ఈ కార్యక్రమంలో TYJF సభ్యులు ఉన్నారు.