'ఈనెల 15 నుంచి జిల్లాలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ'

'ఈనెల 15 నుంచి జిల్లాలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ'

అనంతపురం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొత్తగా స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్హులైన 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు.