VIDEO: శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యపై సీపీఎం ప్రశ్న
TPT: శ్రీవారి మెట్టు మార్గంలో 32 కుటుంబాల చిరు వ్యాపారులను అనుమతించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట 562వ రోజుకు చేరుకున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. వ్యాపారులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.