బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు

బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు

KDP: మైదుకూరులోని నంద్యాల రోడ్డులో గల కేసీ కెనాల్ కాలువ సమీపంలో 2 బైకులు ఢీకొని ఇరువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌‌పై సురేశ్, చెన్నయ్యలు వెళ్తుండగా మరో బైక్‌పై ఎదురుగా వస్తున్న యువకుడు ఢీకొనడంతో కిందపడ్డారు. ఈ ఘటనలో చెన్నయ్య తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.