శ్రీ కనకదాస విగ్రహావిష్కరణ MPకి ఆహ్వానం
సత్యసాయి: రొద్దం మండలం కలిపి గ్రామంలో ఈనెల 22న శనివారం శ్రీ కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథిని కురుబ సంఘం నాయకులు ఆహ్వానించారు. పెనుకొండ మండలంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీని సోమవారం మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు.