అగపురాలో అలంకారప్రాయంగా వీధిలైట్లు

HYD: అగపురాలో వీధిలైట్లు అలంకారప్రాయంగా మారాయి. గత కొన్ని రోజులుగా వీధిలైట్లు వెలగడం లేదు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా సిబ్బంది మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని, నూతన వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు.